Wednesday, April 18, 2007

భువి లొ దివి

భాషకందని భావం...
మాటచాలని అందం....
చుసేది చిన్నదే....
అనుభుతే పెద్దది....

ఎవరో భావ కవి అన్నట్టు ..."అనుభూతులెన్ని ఉన్నా హ్రుదామొకటే కదా...."అలాంటి నా చిన్న హ్రుదయాన్ని స్ప్రుసించిన కొన్ని అందాలు ఇవిగో ఇక్కడ పొందుపరిచాను చూడండి..
ఇవాళ అనుకొకుండా తారసపడ్డాయి నాకు ఈ చిన్న చిన్న అందలు....మదిలొ నింపయి ఎన్నెన్నో అనందాలు...



అది సిరిగాలపల్లి అనే అతి చిన్న గ్రామం..
పశ్చిమ గొదావరి జిల్లాలో పాలకొల్లు నుంచి సరిగ్గా యెడు కిలొమీటర్ల దూరంలో...
ఆ రొజు...గ్రామదేవత జాతర ....
రాత్రి అంతా జాతర సందడి...
గొధూలివేళ మొదలయ్యి....
అసురసంధ్య వెళ దాటి....
చందమామను నిద్రపుచ్చి...
తారలతో తారంగమాడి....
తపముని కిరణం తామస హరణమయ్యే వెళకి...ముగిసింధి ఆ జాతర.....


కొయిలమ్మలు గొంతులు సవరించుకునే వేళ.....
మేము వచ్చేసామరరోయి...
బైటకు వచ్చి చూడండి మా ఆట పాట......
మీ అనందం మా కాలి ఆట..మా నొటి పాట...
మా అనందం మీ మొము నవ్వు..మీ చెతి బక్షి....అంతూ
"బుక్క" అనబడె "గొధుముల" పొగ వదులుతున్న జాతర ఆటగాళ్ళు....




మా చిట్టి చిట్టి దీపాల ముగ్గు మీద....
నీ బుక్క పొగ వేసి....
మా ముంగిటికి ముగ్ధ సౌందర్యం తెచ్చి పెట్టినందుకు...
ఇదిగొ నీకు బక్షి....
అంటూ చుస్తున్న పల్లె పడుచు....





అందాల ఆట చూడు...
అలుపెరుగని ఆట చూడు...
బాకాల జొరు చూడు...
"నిజమైన అందాల నడుమ..
బుజి బుజ్జి సంబ్రమాలచెంత....
తాతమ్మలు..
అమ్మమలు..
తాతయ్యలు...
ఆమ్మలు,పెదనానలు...
గొలీలు,గచ్చకాయలు...
వీది బడ్లు...
వేమన శతకాలు...."
వీటి నడుమ పెరిగిన బాల్యంలో....
ఎన్నొ అనుభవాలు మరెన్నో అనుభూతులు.....



చిట్టి తల్లీ....
ముఢ నమ్మకాలు,అంద విశ్వాసాలు అంటూ..
ప్రాగ్నులు విగ్నులు కొట్టి పడెసే మన భారతీయ సంస్కృతి ఇది......
దేహీ అని అడిగినవాడికి ఇతోదికంగా ఎదో ఒకటి అందించు..
నీ చేతితో..నీకు చెతైనంతలో......
ఇస్తున్న ఈ తాయిలం..మీ చేతిలోని కళలకు...మీకున్న నైపుణ్యముకు....
సంగీతం ...
సాహిత్యం....
న్రుత్యం....
సర్వకళా సొభితులు మన భారతీయులు....
కళ ని కళ గానే కాక...కళలొని దైవత్వాన్ని చుడగలగిన..సంస్కృతి మనది..
తెలుసుకొమ్మా చిట్టి తల్లి...

"ఆ అందమైన పల్లెలో... హ్రుద్యమైన బాల్యం ఈ బుజ్జి పాపది...
పెరు పరిణీత...
ఊరు సిరిగాలపల్లి..."




బారులుతీరిన మండువ ఇళ్ళు....
దారికి ఇరువైపుల..కళ్ళాపి ముగ్గులు...
కాసింత ముందుకు నడవండి....
మరికొంచం అడుగులు వేయండి...
ఆ అదిగో ఆ కనపడుతున్నదే
మా చేలు..
వరి చేలు..
వరాల చేలు...